మేలుకో ! ఎలుకో !!
ఓ తెలంగాణా ముద్దు బిడ్డ మేలుకో !
నీ రాష్ట్రాన్ని నీవు ఎలుకో !!
పోరాటలకు ఉపిరి గడ్డ
ఓ తెలంగాణా ముద్దు బిడ్డ
పాలకుల దోపిడీకి ఎదురొడ్డి పోరాడు
నీ ఓటు అనే తూటా తో పోటు పోడు
బాంచెను కాల్మొక్త అనే బతుకు నుండి విముక్తి కొరకు
ప్రాణ సమాన మైన తెలంగాణా యాస కొరకు,
గల గల పారే కృష్ణమ్మ నీటి కొరకు,
ఉవ్వెథున ఎగిసే గోదావరి తల్లి జోరు కొరకు,
బతుకమ్మ బతుకు కొరకు,హొలీ రంగుల ఖెళీ కొరకు,
కమ్మ నైనా తెలంగాణా మట్టి కొరకు,
ఆఖరి లోల్ళీ లో విజయం కొరకు,
తెలంగాణా వాదం కొరకు,
మేలుకో ఓ తెలంగాణా ముద్దు బిడ్డ మేలుకో !
ఎలుకో నీ రాష్ట్రాన్ని నీవు ఎలుకో !!
పచ్చని పల్లెల తెలంగాణా కొరకు,
ఆలై బలై రాష్ట్రం కొరకు,చరిత్ర లో నిలిచి పోయే తెలంగాణా కొరకు,
ప్రత్యేక తెలంగాణా పోరు లో అమరులైన వీరుల ఆత్మ శాంతి కొరకు,
రాళ్ళ తో రజాకార్లను తరిమికొట్టిన స్పూర్తి తో,
తెలంగాణా సోయి తో ఆంధ్ర పాలకుల
రొమ్ము విరిచి తెలంగాణా అడిగిన ఫనికర మల్లన్న ఆదర్శం తో,
రాజ్యాంగం చూపిన దారిలో, ప్రజాస్వామ్య పద్దతి లో,
"ఓటు"అనే ఆయుధం తో, పాలకుల మెడలు వంఛుట కొరకు,
తెలంగాణా తల్లిని ప్రతిబింబించుట కొరకు,
ఓ తెలంగాణా ముద్దు బిడ్డ మేలుకో !
ఎలుకో నీ రాష్ట్రాన్ని నీవు ఎలుకో !!
జై తెలంగాణా ! జై జై తెలంగాణా !!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment